
బిజినెస్

ఆంధ్రప్రదేశ్‌లో మనిషి-ఏనుగు ఘర్షణలకు అడ్డుకట్ట వేసేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలమనేరు, పార్వతీపురం ప్రాంతాల్లో ఆరు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రంగంలోకి దించారు. కర్ణాటక అటవీ శాఖతో చేసుకున్న ఒప్పందం ద్వారా ఈ కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకొచ్చారు. అడవి ఏనుగుల కదలికలను నియంత్రించడం, పంట పొలాలకు నష్టం తగ్గించడం వంటి చర్యల్లో ఇవి అటవీ శాఖకు సహకరిస్తున్నాయి.
కుంకీ ఏనుగుల రాకతో పంట నష్టం 70–80 శాతం వరకు తగ్గిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణలను తగ్గించడంతో పాటు స్థానిక ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఈ చర్యలను చేపట్టారు. విధుల్లో ఉన్న కుంకీ ఏనుగులకు అవసరమైన ఆహారం, నీటిని అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా అందిస్తున్నారు. దీంతో మనిషి-వన్యప్రాణి ఘర్షణలను నియంత్రించేందుకు ఈ మిషన్ కీలకంగా మారుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!