

మూడు రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత సమావేశాలకు నేటితో ముగింపు పలకనున్నారు. చివరి రోజు సభలో 22ఏ నిషేధిత భూముల అంశంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో ప్రకటన చేసి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. 22ఏ భూముల వ్యవహారంతో పాటు ధరణిలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, భూముల రిజిస్ట్రేషన్లకు ఎదురవుతున్న ఇబ్బందులపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. అవసరమైతే 22ఏ అంశంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై కూడా అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, నీటి లభ్యత, వ్యవసాయ రంగంపై పడే ప్రభావం వంటి అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. కరవు పరిస్థితులు, నీటి కొరతను ఎదుర్కొనే చర్యలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!