

రాష్ట్ర జల వనరుల శాఖ రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారుల సంఘం ప్రకారం, గోదావరి నదిలోని వరద జలాలను వినియోగించుకునే పూర్తి హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. గోదావరి నదీ జలాల వివాద ట్రైబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసిన అనంతరం దిగువకు ప్రవహించే జలాలపై చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు సంపూర్ణ హక్కులు ఉన్నాయని స్పష్టం చేసిందని సంఘం తెలిపింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఎం. విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.
గోదావరి, బనకచర్ల అనుసంధాన పథకాన్ని గోదావరి నదిలోని 75 శాతం మిగులు జలాల ఆధారంగా నిర్మించుకోవచ్చని సంఘం పేర్కొంది. ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం లేదా ఎగువ రాష్ట్రాలు అభ్యంతరం చెప్పే అధికారం లేదని స్పష్టం చేసింది. 1978 ఆగస్టు 4, 1978 ఆగస్టు 7, 1978 డిసెంబరు 15 తేదీల్లో ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ హక్కులను రక్షిస్తున్నాయని తెలిపింది. ఈ పథకం ద్వారా కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల కరువు ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు రాయలసీమ, కోస్తా ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం అవుతుందని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!