

ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం 6,937 సీట్లలో 6,929 సీట్లు భర్తీ అయ్యాయి. దీంతో 99.88 శాతం సీట్ల భర్తీ నమోదైంది. ఈ వివరాలతో కూడిన నివేదికను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు అందజేశారు. భర్తీ అయిన సీట్లలో 61.34 శాతం మంది విద్యార్థినులే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
భర్తీ అయిన మొత్తం సీట్లలో కన్వీనర్ కోటా కింద 4,581 సీట్లు, యాజమాన్య కోటా కింద 2,348 సీట్లు కేటాయించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ వంద శాతం సీట్ల భర్తీ పూర్తయింది. మొత్తంగా ఈ విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్లలో దాదాపు అన్నీ భర్తీ కావడంతో ప్రవేశాల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!