

డిజిటల్ ఆర్థోడాంటిక్ టెక్నాలజీలో ప్రపంచస్థాయి సంస్థ అలైన్ టెక్నాలజీ తెలంగాణలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో భారతదేశంలో తమ తొలి తయారీ కేంద్రాన్ని రూ.1,800 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి నాలుగో తయారీ కేంద్రం కానుంది.
ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో అలైన్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జిట్సే మారీ, తెలంగాణ లైఫ్‌సైన్సెస్ సీఈఓ సర్వేశ్ సింగ్ మధ్య ఎంఓయూ కుదిరింది. ఈ యూనిట్ అత్యాధునిక 3డీ ప్రింటింగ్, డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ వ్యవస్థలతో పనిచేయనుంది. రోజుకు సుమారు 10 లక్షల కస్టమ్ క్లియర్ అలైనర్ భాగాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. 2027లో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రారంభ దశలో 300 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!