
షోస్

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ తేదీల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ మార్పును గమనించి తమ యాత్రను అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని సూచించింది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!