
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక టెక్నాలజీతో వైద్య సేవలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం ఏఐ సేవలను ప్రవేశపెడుతోంది. దీనికోసం 18 స్టార్టప్ సంస్థలను ఎంపిక చేసి 18 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులుగా వివిధ సేవలను పరీక్షిస్తోంది. రోగులు, వైద్యుల మధ్య సంభాషణను రికార్డు చేసి చికిత్సకు సంబంధించిన సమ్మరీ తయారు చేసే విధంగా ఈ టెక్నాలజీ పనిచేస్తోంది.
దగ్గు ద్వారా టీబీ గుర్తించడం, గుండె జబ్బులు, రక్తహీనత ముందుగానే గుర్తించడం, సర్వైకల్ క్యాన్సర్ చికిత్సలో ఏఐ కెమెరా వినియోగం వంటి పలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కాకినాడ, విజయవాడ వంటి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు. ‘ఏపీ మెడ్టెక్ ఇన్నోవేషన్ చాలెంజ్’ ద్వారా ఎంపిక చేసిన స్టార్టప్‌లను ‘క్యాథ్’ కమిటీ పరిశీలిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!