

టాలీవుడ్ నటి సురేఖా వాణి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని, తన అనుమతి లేకుండా కొందరు వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని వెల్లడించారు. ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నోట్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.
మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు, వ్యక్తులు ఎవరైనా సరే.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కంటెంట్‌ను వెంటనే షేర్ చేయడం, రీపోస్ట్ చేయడం ఆపాలని సురేఖా వాణి విజ్ఞప్తి చేశారు. ఈ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్న ఖాతాలు, వ్యక్తులను గుర్తించి ఆధారాలు సేకరిస్తానని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. వ్యూస్, రీచ్, పబ్లిసిటీ కోసం ఈ పరిస్థితిని ఉపయోగించుకోవద్దని కోరారు. తన వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని స్పష్టం చేశారు. 2005లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సురేఖా వాణి.. ‘భద్ర’, ‘బొమ్మరిల్లు’, ‘ఏమాయ చేశావే’, ‘నాయక్’, ‘బాద్ షా’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!