

కళాశాల విద్యార్థుల డిజిటల్, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రూ.2,000 కోట్లతో వెట్రి ల్యాప్‌టాప్ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులతో పాటు డిప్లొమా విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించనున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, మెడిసిన్, వెటర్నరీ సైన్స్, ఫిషరీస్, అగ్రికల్చర్, లా తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
అలాగే 2025–26 విద్యా సంవత్సరంలో గత ల్యాప్‌టాప్ పంపిణీ పథకం ద్వారా ప్రయోజనం పొందని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లోని ప్రొఫెషనల్ కోర్సుల మూడో, నాలుగో సంవత్సరం విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తించనుంది. ఇంజినీరింగ్ విద్యార్థుల సాంకేతిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ లేదా అంతకంటే మెరుగైన సమాన సామర్థ్యం కలిగిన ల్యాప్‌టాప్‌లను అందించనున్నారు. నాణ్యతా ప్రమాణాలతో ల్యాప్‌టాప్‌ల కొనుగోలు బాధ్యతను తమిళనాడు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ (ELCOT)కు అప్పగించారు. పథకం అమలును పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!