
జనరల్

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ డిసెంబర్ 12న అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించి, శ్రీరాముడిని దర్శించుకోనున్నట్లు సమాచారం. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 2024 జనవరిలో రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన ఆలయాన్ని సందర్శించనుండటం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్ అయోధ్య పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర రాజకీయాల్లో రామ మందిరం కీలక అంశంగా ఉన్న నేపథ్యంలో ఆయన పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు ఈ పర్యటన ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!