
జనరల్

మహారాష్ట్రలోని వాసిమ్ జిల్లా సెషన్స్ కోర్టు కస్టడీ మరణం కేసులో సంచలన తీర్పు వెలువరించింది. పోలీస్ కస్టడీలో జరిగిన మరణానికి సంబంధించి తొమ్మిది మంది పోలీసు సిబ్బందికి జీవిత ఖైదు విధించింది. దాదాపు 15 ఏళ్లుగా విచారణ సాగిన ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ తీర్పును ప్రకటించింది.
కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం వల్లే బాధితుడు మరణించినట్లు కోర్టు నిర్ధారించింది. అప్పటి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జితో పాటు మొత్తం తొమ్మిది మంది పోలీసులను దోషులుగా తేల్చుతూ జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా కస్టడీ మరణాల కేసులపై కీలక న్యాయ పరిణామంగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!