

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) కంపెనీలపై పెట్టుబడిదారుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఉత్సాహం 1999 నాటి డాట్‌కామ్ బూమ్‌ను గుర్తు చేస్తోందని రాబర్ట్ కియోసాకి అభిప్రాయపడ్డారు. అప్పట్లో ఏఓఎల్, నెట్‌స్కేప్, పెట్స్.కామ్ వంటి ఇంటర్నెట్ కంపెనీలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే డాట్‌కామ్ బబుల్ పేలిన తర్వాత అనేక సంస్థల విలువలు కుప్పకూలి, పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారు.
ఆర్థిక విశ్లేషకుడు, రచయిత జిమ్ రికార్డ్స్ కూడా ఏఐ రంగంలో భారీ పెట్టుబడులు, అధిక విలువలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏఐ రంగంలో సుమారు 1.4 ట్రిలియన్ డాలర్ల విలువ ప్రమాదంలో పడే అవకాశం ఉందని, పరిస్థితులు తీవ్రంగా మారితే స్టాక్ మార్కెట్‌లో భారీ దిద్దుబాటు సంభవించవచ్చని ఆయన హెచ్చరించారు. ఏఐ చిప్‌లకు భారీ డిమాండ్ కారణంగా ఎన్విడియా వంటి కంపెనీలపై పెరిగిన అంచనాలను కూడా పెట్టుబడిదారులు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.
అయితే కృత్రిమ మేధస్సు సాంకేతికత భవిష్యత్తులో కీలకంగా మారదనే అర్థం కాదని నిపుణులు చెబుతున్నారు. సమస్య సాంకేతికతలో కాకుండా, దాని ఆధారంగా కంపెనీలపై ఏర్పడుతున్న అధిక అంచనాలు, షేర్ ధరలు వాస్తవ వ్యాపార ఫలితాల కంటే ముందుకు వెళ్లడంలో ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. మార్కెట్ భారీగా పడిపోతుందనే అంచనాలను ఖచ్చితమైనవిగా భావించకుండా, కంపెనీల ఆదాయం, లాభాలు, అప్పులు, ప్రస్తుత విలువ వంటి అంశాలను పరిశీలించి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!