
బిజినెస్

అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ఎల్ఐసీ (LIC) భారీ నష్టాలను చవిచూసింది. ఫిబ్రవరి 27 నాటికి ₹14.88 లక్షల కోట్లుగా ఉన్న ఎల్ఐసీ పెట్టుబడుల విలువ, మార్చి 9 నాటికి సుమారు 4.7 శాతం తగ్గి ₹14.17 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే కేవలం కొన్ని రోజుల్లోనే దాదాపు ₹70,105 కోట్ల విలువ తగ్గినట్లు ఏస్ ఈక్విటీ సంస్థ వెల్లడించిన డేటా ద్వారా తెలిసింది.
ప్రధానంగా ఎస్బీఐ (SBI), హెచ్డీఎఫ్సీ (HDFC), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) షేర్ల పతనం కారణంగా ఎల్ఐసీకి సుమారు ₹15,293 కోట్ల నష్టం (21.8%) వచ్చినట్లు సమాచారం. అలాగే ఎల్ అండ్ టీ (L&T) కంపెనీలో చేసిన పెట్టుబడుల వల్ల కూడా సుమారు ₹7,609 కోట్ల నష్టం సంభవించినట్లు వెల్లడైంది.








.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!