
జనరల్

అదానీ గ్రూప్‌కు భారీ ఊరట లభించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ తదితరులపై నమోదైన క్రిమినల్ కేసులను అమెరికా న్యాయశాఖ పూర్తిగా ఉపసంహరించుకుంది. న్యూయార్క్‌లో కొనసాగుతున్న సెక్యూరిటీస్, వైర్ ఫ్రాడ్ కేసులకు దీంతో ముగింపు పలికినట్లైంది.
కోర్టులో దాఖలు చేసిన నివేదికలో అమెరికా న్యాయశాఖ “ప్రాసిక్యూటోరియల్ డిస్క్రెషన్” ప్రకారం ఈ కేసులపై ఇకపై అదనపు వనరులు వినియోగించబోమని తెలిపింది. ఈ కేసులను ‘విత్ ప్రిజుడీస్’గా కొట్టివేయడంతో భవిష్యత్తులో మళ్లీ విచారణకు అవకాశం లేకుండా పోయింది. ఈ పరిణామం అదానీ గ్రూప్‌కు పెద్ద న్యాయ విజయంగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!