
జనరల్

భారత మూలధన మార్కెట్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పెట్టుబడిదారుల రక్షణను మరింత బలోపేతం చేసేందుకు సెబీ (SEBI) కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముంబైలో జరిగిన 214వ బోర్డు సమావేశంలో మరణించిన పెట్టుబడిదారుల షేర్లు, సెక్యూరిటీలను వారి చట్టబద్ధ వారసులకు బదిలీ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసే నిర్ణయం తీసుకుంది.
ఈ మార్పులతో పరిపాలనాపరమైన ఇబ్బందులు, జాప్యాలు తగ్గి షేర్ల బదిలీ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని సెబీ తెలిపింది. ఈ సంస్కరణలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచడంతో పాటు భారత మూలధన మార్కెట్లను మరింత పారదర్శకంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తాయని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!