
బిజినెస్

టిమ్ కుక్ భవిష్యత్తులో ఐఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా రానున్న ఐఫోన్ 18 శ్రేణి ధరలు పెరగవచ్చని ఆయన పేర్కొన్నారు. ఉత్పత్తి, సరఫరా వ్యయాలు పెరిగినా ఇప్పటివరకు వినియోగదారులపై అదనపు భారం పడకుండా సంస్థే భరించిందని తెలిపారు.
అయితే పెరుగుతున్న ఖర్చులను నిరంతరం సంస్థ భరించడం సాధ్యం కాదని టిమ్ కుక్ వెల్లడించారు. అందువల్ల కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయాల్సిన పరిస్థితి రావచ్చని వ్యాఖ్యానించారు. దీంతో ఐఫోన్ 18 విడుదల సమయంలో ధరల పెంపు ఉండొచ్చనే చర్చ మొదలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!