అమెరికా సుప్రీంకోర్టు టారీఫ్ల అమలుపై ఇచ్చిన తీర్పు దేశీయ స్టాక్ మార్కెట్లలో సానుకూల ప్రభావాన్ని చూపించింది. దీంతో సోమవారం మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా పీఎస్యూ బ్యాంకులు, ఆటోమొబైల్, ఫైనాన్షియల్ సర్వీసుల రంగాలకు చెందిన షేర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చాయి.
భారీ కొనుగోళ్ల నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 479 పాయింట్లు ఎగిసి 83,294.66 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఒక దశలో 671.44 పాయింట్ల వరకు పెరిగి 83,486.15ను తాకింది. అదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 141.75 పాయింట్ల లాభంతో 25,713 వద్ద స్థిరపడింది. సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగియడం గమనార్హం. మార్కెట్ వెడల్పు మిశ్రమంగా కనిపించింది. బీఎస్ఈలో మొత్తం 2,435 షేర్లు పడిపోగా, 1,894 షేర్లు లాభాల్లో నిలిచాయి. 168 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
అమెరికా సుప్రీంకోర్టు టారీఫ్ల అమలును రద్దు చేయడం మదుపరుల్లో ఉత్సాహాన్ని పెంచిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు, ట్రంప్ 15 శాతం సుంకాలను మళ్లీ విధిస్తామని ప్రకటించిన అంశాన్ని మార్కెట్ పెద్దగా పట్టించుకోలేదని వారు చెప్పారు. అయితే డాలర్ బలహీనత, 10 ఏళ్ల అమెరికా ట్రెజరీ బాండ్ల యీల్డ్లు తగ్గడం మధ్యకాలంలో గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు సూచించారు. నిన్న ట్రేడింగ్లో పీఎస్యూ బ్యాంక్ సూచీ 1.4 శాతం పెరగగా, హాస్పిటల్ సూచీ 0.89 శాతం, సేవల రంగం 0.97 శాతం, ఆటోమొబైల్ 0.71 శాతం, ఫైనాన్షియల్ సర్వీసుల రంగం 0.65 శాతం లాభాలను నమోదు చేశాయి.





.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)











.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!