

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లోనూ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల సెంటిమెంట్లు మార్కెట్‌ను భారీగా దెబ్బతీస్తున్నాయి. బుధవారం ఉదయం.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు(సుమారు 1 శాతం మేర) పడిపోయి.. ఇంట్రాడేలో కనిష్ఠ స్థాయి 81,124.45ని తాకింది. నిఫ్టీ సుమారు 250 పాయింట్లు క్షీణించి.. 25,000 స్థాయిని సమీపించింది. ఇది ఇంట్రాడేలో కనిష్ఠ స్థాయి 24,919.80ని తాకింది. మూడు రోజులుగా.. సెన్సెక్స్ 2,400 పాయింట్లకుపైగా(దాదాపు 3 శాతం) కుప్పకూలింది.
ఇక బీఎస్ఈ నిఫ్టీ-50 ఇదే తరహాలో పతనం కొనసాగిస్తూ..మూడు రోజుల్లో 3 శాతం మేర క్షీణించింది. శుక్రవారం నాటి బిఎస్ఈ లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.468 లక్షల కోట్ల నుంచి రూ.450 లక్షల కోట్లకు పడిపోవడంతో.. వరుసగా మూడు సెషన్లలో రూ.18 లక్షల కోట్లు నష్టపోయారు.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!