
గాసిప్స్

కేంద్ర బడ్జెట్ ప్రకటించిన అనంతరం స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమ్మకాల వెల్లువతో సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్ల వరకు పడిపోగా, నిఫ్టీ కూడా సుమారు 330 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది.
అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ సుమారు 870 పాయింట్లు దిగజారింది. విస్తృత మార్కెట్లోనూ ప్రభావం స్పష్టంగా కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ దాదాపు 1,100 పాయింట్ల నష్టంతో కదిలింది.
విదేశీ దిగుమతి వస్తువుల పై సుంకాలను తగ్గించడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా మారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా, విదేశీ పెట్టుబడుల పరిమితిని 24 శాతానికి పెంచడం కూడా పెట్టుబడిదారుల ఆందోళనను పెంచిన మరో కారణంగా పేర్కొంటున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!