
న్యూస్

శ్రీలంక ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఆక్టేన్ 92 పెట్రోల్ ధరను లీటరుకు రూ.24 పెంచడంతో ప్రస్తుతం అది రూ.317కి చేరింది. అలాగే ఆక్టేన్ 95 పెట్రోల్‌పై రూ.25 పెంపు చేయడంతో లీటరు ధర రూ.365గా ఉంది. ఆటో డీజిల్ ధరను రూ.22 పెంచగా ప్రస్తుతం అది లీటరుకు రూ.303గా ఉంది. సూపర్ డీజిల్‌పై రూ.24 పెంపుతో లీటరు ధర రూ.353కి చేరింది. అదేవిధంగా కిరోసిన్ ధరను రూ.13 పెంచి లీటరు ధరను రూ.195గా నిర్ణయించారు.
ఇక పాకిస్థాన్‌లో కూడా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. అక్కడి ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 మేర పెంచినట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు రెండు దేశాల్లో ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



.jpg&w=3840&q=75)



.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!