

భారత అంతరిక్ష రంగంలో వేగంగా ఎదుగుతున్న స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారుల మద్దతు లభించింది. ప్రముఖ టెక్ ఇన్వెస్టర్, అల్ఫాబెట్ బోర్డు సభ్యుడు రామ్ శ్రీరామ్‌కు చెందిన షేర్పాలో వెంచర్స్, సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడి సంస్థ జీఐసీ సంయుక్తంగా తాజా నిధుల సేకరణకు నాయకత్వం వహించాయి. వీటితో పాటు బ్లాక్‌రాక్, గ్రీన్కో వ్యవస్థాపకులు, ఆర్కమ్ వెంచర్స్, ప్లేబుక్ పార్ట్నర్స్, శాంఘ్వీ ఫ్యామిలీ ఆఫీస్ వంటి ప్రముఖ పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నారు. ఈ పెట్టుబడుల భాగంగా రామ్ శ్రీరామ్ స్కైరూట్ బోర్డులో చేరనున్నారు.
2023లో జరిగిన 51 మిలియన్ డాలర్ల సిరీస్-బి ఫండింగ్ సమయంలో స్కైరూట్ విలువ 519 మిలియన్ డాలర్లుగా, అంటే సుమారు ₹4,812 కోట్లుగా అంచనా వేశారు. కేవలం మూడేళ్లలోనే ఆ విలువ దాదాపు రెట్టింపు కావడం సంస్థ వేగవంతమైన వృద్ధికి నిదర్శనంగా నిలిచింది. ఈ ఏడాది మార్చిలో బ్లాక్‌రాక్ సంస్థ స్కైరూట్‌కు ₹100 కోట్ల రుణాన్ని కూడా అందించింది. నాగ భరత్ డాకా, పవన్ కుమార్ చందన స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు విక్రమ్-1 ప్రయోగాన్ని విజయవంతం చేయడంపై దృష్టి సారించింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!