
జనరల్

కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తమ అన్ని వాహనాల ధరలను వచ్చే నెల 1 నుంచి గరిష్ఠంగా 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు మారుతుందని కంపెనీ తెలిపింది. ముడి పదార్థాల ధరలు, ఉత్పత్తి వ్యయాలు, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
అలాగే టాటా మోటార్స్ తమ వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి ట్రక్కులు, బస్సులు సహా అన్ని కమర్షియల్ వాహనాల ధరలను గరిష్ఠంగా 2.5 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!