

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'స్వయంభూ' ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అయితే ఇప్పటికీ విడుదల తేదీపై అధికారిక ప్రకటన రాకపోవడంతో అభిమానుల్లో నిరాశ పెరుగుతోంది. వరుస వాయిదాల కారణంగా సినిమాపై మొదట కనిపించిన ఉత్సాహం క్రమంగా తగ్గుతోందనే అభిప్రాయాలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ శక్తివంతమైన యోధుడి పాత్రలో నటిస్తుండగా, సంయుక్త కథానాయికగా కనిపించనున్నారు. పాత్ర కోసం నిఖిల్ కత్తిసాము, గుర్రపు స్వారీ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ పొందారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. విడుదల తేదీపై స్పష్టత కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!