

దర్శకుడు సుజీత్ తదుపరి ప్రాజెక్టులపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కుతున్న ఓజీ 2 ముందుగా ప్రారంభమవుతుందని ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా నాని హీరోగా రూపొందనున్న బ్లడీ రోమియో ప్రాజెక్టు ముందుకు వచ్చినట్లు సమాచారం. దీంతో సుజీత్ తదుపరి చిత్రం ఏదన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ 2 కోసం ఎదురుచూస్తుండగా, తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల వరకు ఓజీ 2 చిత్రీకరణ నవంబర్‌లో ప్రారంభమవుతుందని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు తాత్కాలిక విరామం వచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నాని నటించనున్న బ్లడీ రోమియోను ముందుగా సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ రెండు ప్రాజెక్టులపై చిత్రబృందాల నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!