
టెక్నాలజీ

పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని సవరించింది. తాజా నిర్ణయం ప్రకారం డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.15.50 నుంచి రూ.24కు పెంచగా, పెట్రోల్‌పై లీటరుకు రూ.2.50 నుంచి రూ.3.50కు పెంచింది. విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేసే రిఫైనరీలు పొందే అదనపు లాభాలపై ఈ సవరించిన సుంకం వర్తించనుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడం వల్ల చమురు కంపెనీలు పొందుతున్న అదనపు లాభాలపై పన్ను విధించేందుకు విండ్‌ఫాల్ ట్యాక్స్ విధానాన్ని కేంద్రం అమలు చేస్తోంది. తాజా నిర్ణయంతో ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం పెరగనుండగా, ఇంధన ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!