

అంతర్జాతీయ ముడి చమురు ధరల్లో కొనసాగుతున్న అస్థిరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (విండ్‌ఫాల్ ట్యాక్స్)ను మరోసారి పెంచింది. ఆగస్టు 3 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రేట్ల ప్రకారం, డీజిల్‌పై ట్యాక్స్‌ను లీటర్‌కు రూ.15.5 నుంచి రూ.25.5కు పెంచగా, పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్ని రూ.2.5 నుంచి రూ.3.5కు పెంచారు. అలాగే ఏటీఎఫ్‌పై ట్యాక్స్‌ను రూ.14.5 నుంచి రూ.22కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. దీంతో ఇంధన ఎగుమతులపై కంపెనీలకు లాభాలు పెరిగిన నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో సరఫరాను మెరుగుపరచడం, అధిక ఎగుమతులను నియంత్రించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇదివరకు జూలై 16న కూడా ట్యాక్స్‌లో మార్పులు చేసిన కేంద్రం, అప్పట్లో డీజిల్, ఏటీఎఫ్‌పై సుంకాలను పెంచగా, పెట్రోల్‌పై తగ్గించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!