
జనరల్

మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజులోనే తులం బంగారం ధర రూ.19,750 వరకు తగ్గడం గమనార్హం. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,653 గా నమోదైంది. ఒక్కరోజే దాదాపు 10 శాతం మేర బంగారం ధర పడిపోవడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వెండి ధరలు కూడా తీవ్రంగా క్షీణించాయి. ఒక్కరోజే కిలో వెండి ధర రూ.1,07,971 వరకు తగ్గి ప్రస్తుతం రూ.2,91,922 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు సుమారు 34 శాతం వరకు పడిపోవడం దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపింది. ధరల అకస్మాత్తు పతనంతో పెట్టుబడిదారులు, వ్యాపారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!