

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ తమ భారతీయ యూనిట్‌ను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలన్న యోచన ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది. ఇందుకు బదులుగా, తమ అన్ని ఉత్పత్తుల్లో కృత్రిమ మేధ (AI) సాంకేతికతను విస్తృతంగా అమలు చేయడంపై దృష్టి సారిస్తామని, దేశీయ మార్కెట్లో అమ్మకాలను పెంచేందుకు కన్స్యూమర్ ఫైనాన్స్ విభాగాన్ని మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది.
ఈ విషయాన్ని సామ్సంగ్ ఆగ్నేయాసియా విభాగం ప్రెసిడెంట్ మరియు సీఈఓ జేబీ పార్క్ వెల్లడించారు. దేశంలో తయారీ సామర్థ్యాలను మరింత పెంచేందుకు సంస్థ సిద్ధంగా ఉందని కూడా తెలిపారు. మొబైల్ ఫోన్ డిస్ప్లేలను భారత్‌లోనే తయారు చేయడానికి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాలు (PLI) పొందేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని ఆయన చెప్పారు.
ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన హ్యుండయ్ మోటార్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పటికీ, సామ్‌సంగ్‌కు మాత్రం ప్రస్తుతం అలాంటి ప్రణాళికలు లేవని పార్క్ స్పష్టం చేశారు.
.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!