

ఐటీ దిగ్గజం విప్రో లిమిటెడ్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.3,352 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ.3,330.4 కోట్లతో పోలిస్తే స్వల్ప వృద్ధి నమోదు చేసింది. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 10.6 శాతం పెరిగి రూ.24,478.6 కోట్లకు చేరుకుంది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన నికర లాభం 4.2 శాతం తగ్గగా, ఆదాయం 1 శాతం పెరిగింది.
సమీక్షా త్రైమాసికంలో ఐటీ సర్వీసుల విభాగం నుంచి 2.6145 బిలియన్ డాలర్ల ఆదాయం లభించింది. ఇది వార్షికంగా 1 శాతం వృద్ధి నమోదు చేయగా, త్రైమాసిక ప్రాతిపదికన 1.4 శాతం తగ్గింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఐటీ సర్వీసుల ఆదాయం 2.574 బిలియన్ నుంచి 2.627 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని విప్రో అంచనా వేసింది. మొత్తం బుకింగ్స్ 3.37 బిలియన్ డాలర్లు, భారీ డీల్ బుకింగ్స్ 1.626 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వేతన పెంపులు, కృత్రిమ మేధ (AI) రంగంలో పెట్టుబడుల ప్రభావంతో ఐటీ సర్వీసుల ఆపరేటింగ్ మార్జిన్ 16 శాతానికి తగ్గిందని సీఎఫ్వో అపర్ణ అయ్యర్ తెలిపారు. అలాగే కంపెనీ బోర్డు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.2 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!