
ఓటీటీ

భారత కరెన్సీ రూపాయి మరోసారి భారీ ఒత్తిడిని ఎదుర్కొంటూ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. సోమవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 39 పైసలు క్షీణించి రూ.95.23 వద్ద ముగిసింది. ఇంతకుముందు ఇంట్రాడే ట్రేడింగ్‌లో మాత్రమే రూ.95 మార్క్‌ను దాటిన రూపాయి, తొలిసారి ఆ స్థాయి ఎగువన ముగియడం మార్కెట్లలో ఆందోళన కలిగిస్తోంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాలు మరియు ఆర్థిక వృద్ధి మందగమనం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా ఫారెక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, గ్లోబల్ మార్కెట్ అనిశ్చితి కూడా భారత కరెన్సీపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!