

దేశంలోని అగ్రగామి ఐదు ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రాల మొత్తం మార్కెట్ విలువ భారీగా తగ్గి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) మార్కెట్ విలువకు దాదాపు సమాన స్థాయికి చేరింది. ప్రస్తుతం రూ.17.65 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రిలయన్స్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఉండగా, ఈ ఐదు ఐటీ దిగ్గజాల కలిపిన మార్కెట్ విలువ రూ.18.12 లక్షల కోట్లుగా ఉంది. జూన్ 30 నాటికి ఈ విలువ రూ.17.50 లక్షల కోట్లకు పడిపోవడంతో, అది రిలయన్స్ మార్కెట్ విలువ కంటే కూడా స్వల్పంగా తక్కువగా నమోదైంది.
2024లో జీవితకాల గరిష్ఠమైన రూ.21.19 లక్షల కోట్ల మార్కెట్ విలువ నుంచి రిలయన్స్ విలువ 16.7 శాతం తగ్గగా, ఐటీ దిగ్గజాల మొత్తం మార్కెట్ విలువ మాత్రం 46.2 శాతం క్షీణించింది. 2026లో ఇప్పటివరకు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు 36 శాతం వరకు నష్టపోయాయి. కృత్రిమ మేధ (AI) ప్రభావంతో సంప్రదాయ ఐటీ సేవలకు డిమాండ్ తగ్గుతుందనే ఆందోళనలు, ప్రపంచవ్యాప్తంగా బలహీన ఆర్థిక పరిస్థితులు ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!