

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సంస్థ రోల్స్ రాయిస్ భారత్‌లో రక్షణ, ఇంధన, పౌర విమానయాన రంగాల్లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు భారీ ప్రణాళికలు ప్రకటించింది. భారత తదుపరి తరం యుద్ధ విమానాల కోసం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రోగ్రామ్ కింద ఏరో ఇంజిన్‌ను ఉమ్మడిగా అభివృద్ధి చేయనున్నట్లు కంపెనీ సీఈఓ తూఫాన్ ఎర్గిన్‌బిల్గిచ్ తెలిపారు. పూర్తి మేధోసంపత్తి హక్కుల బదిలీతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం భారత త్రివిధ దళాల్లో 1,400కు పైగా రోల్స్ రాయిస్ ఇంజిన్లు వినియోగంలో ఉన్నాయి.
దేశంలో సంస్థ సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసి 10,000కు చేర్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌ను అత్యాధునిక తయారీకి అంతర్జాతీయ కేంద్రంగా మార్చే దిశగా స్థానిక సరఫరా వ్యవస్థను కూడా విస్తరించాలని భావిస్తోంది. దీని ద్వారా చిన్న, మధ్య తరహా సంస్థలకు (SMEs) కూడా అవకాశాలు పెరుగుతాయని కంపెనీ పేర్కొంది.
రోల్స్ రాయిస్ ఇప్పటికే హెచ్ఏఎల్, ఫోర్స్ మోటార్స్‌తో సంయుక్త తయారీ భాగస్వామ్యాలు కలిగి ఉండగా, టాటా, భారత్ ఫోర్జ్, గోద్రేజ్ వంటి 100కు పైగా వెండర్లతో సోర్సింగ్ భాగస్వామ్యాలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!