

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన సభ్యులకు సౌకర్యాలు మెరుగుపరచేందుకు కొత్త డిజిటల్ మార్పులను తీసుకురానుంది. ఈపీఎఫ్ఓ 3.0లో భాగంగా త్వరలోనే పీఎఫ్ డబ్బులను ఏటీఎం కార్డు లేదా యూపీఐ ద్వారా నేరుగా తీసుకునే అవకాశం కల్పించనున్నారు. మే 2026 చివరికి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పీఎఫ్ ఖాతాలకు ప్రత్యేక ఏటీఎం కార్డులను అనుసంధానం చేసి, ఎలాంటి కాగితపు పనులు లేకుండా డబ్బులను తీసుకునే విధంగా సౌకర్యం కల్పించనున్నారు. అయితే మొత్తం బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఇందుకోసం యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్, ఆధార్, పాన్ లింక్ చేయడం, అలాగే సరైన బ్యాంక్ వివరాలు ఇవ్వడం అవసరం.
ఇక పీఎఫ్ ఉపసంహరణ నిబంధనలను కూడా సులభతరం చేశారు. ముందు ఉన్న 13 రకాల నియమాల బదులు ఇప్పుడు మూడు ప్రధాన విభాగాలుగా మార్చారు. అత్యవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితుల కోసం డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. వైద్య ఖర్చులు, విద్య, వివాహం, ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం, రుణ చెల్లింపుల కోసం కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగం కోల్పోతే వెంటనే 75 శాతం, ఏడాది తర్వాత మిగిలిన 25 శాతం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కేవలం 12 నెలల సేవ ఉన్నా పాక్షికంగా డబ్బులు తీసుకోవచ్చు. ఉద్యోగి వాటాతో పాటు యజమాని వాటా, వడ్డీ కూడా పొందే అవకాశం కల్పించారు. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపిన వివరాల ప్రకారం డిజిటలైజేషన్ వల్ల క్లెయిమ్‌ల పరిష్కారం వేగంగా జరుగుతూ, సంఖ్య గణనీయంగా పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!