

యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. వినియోగదారులు చేసే యూపీఐ చెల్లింపులకు ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. ‘చెల్లింపు, పరిష్కార వ్యవస్థల చట్టం–2007’కు సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో యూపీఐపై భవిష్యత్తులో చార్జీలు విధిస్తారనే ఆందోళన వ్యక్తమైంది. దీనిపై స్పందించిన కేంద్రం.. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలు ఎప్పటిలాగే ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి వస్తే, నిర్దేశిత పరిమితుల ప్రకారం ఎంపిక చేసిన వ్యాపారుల లావాదేవీలపైనే చార్జీలు విధించే అవకాశం ఉంటుందని కేంద్రం తెలిపింది. ఈ చార్జీలు డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలపై వసూలు చేసే రుసుముల కంటే తక్కువగా ఉంటాయని పేర్కొంది. అత్యధిక శాతం వ్యాపారులకు యూపీఐ సేవలు ఉచితంగానే అందుతాయని స్పష్టం చేసింది. మరోవైపు, యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని ఫోన్‌పే ప్రకటించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!