
సినిమాలు

నటి రేణు దేశాయ్ హైదరాబాద్‌లో అర్థరాత్రి వరకు జరిగే గణేశ్ నిమజ్జనాలు, భారీ డీజే శబ్దాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాత్రివేళల్లో పెద్ద శబ్దాలతో వేడుకలు నిర్వహించడం వల్ల పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలుగుతాయని ఆమె అన్నారు. భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకోవడంతో పాటు ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు.
తన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి ట్రోలింగ్ రావడంతో రేణు దేశాయ్ మరో వీడియో ద్వారా స్పందించారు. తాను 18వ అంతస్తులో సౌండ్‌ప్రూఫ్ గదిలో ఉంటానని, తన వ్యక్తిగత ఇబ్బంది కోసం ఈ విషయం మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. అధిక శబ్దాల వల్ల అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, చిన్నారులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించే మాట్లాడుతున్నానన్నారు. పండుగను ఆనందంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని ఆమె కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!