
సినిమాలు

2026 ఆసియా క్రీడల్లో భారత పోల్‌వాల్ట్ అథ్లెట్ భరణికా ఇలంగోవన్ చరిత్ర సృష్టించింది. మహిళల పోల్‌వాల్ట్‌లో 4.15 మీటర్ల ఎత్తును అధిగమించి కాంస్య పతకం సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో పతకం గెలిచిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పింది. కజకిస్థాన్‌కు చెందిన పోలినా ఇవనోవా కూడా 4.15 మీటర్లు క్లియర్ చేయడంతో ఇద్దరికీ సంయుక్తంగా కాంస్యం దక్కింది. జపాన్‌కు చెందిన మిసాకి మోరోటా 4.55 మీటర్లతో స్వర్ణం, చైనాకు చెందిన చుంగే నియు 4.50 మీటర్లతో రజతం సాధించారు.
మహిళల షాట్‌పుట్‌లో భారత అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ 17.17 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకం గెలిచింది. ఆసియా క్రీడల్లో ఆమెకు ఇదే తొలి పతకం. ఈ ఏడాది మేలో జరిగిన ఇండియన్ ఇండోర్ ఓపెన్ పోల్‌వాల్ట్ పోటీల్లో భరణికా 4.23 మీటర్లతో తన జాతీయ రికార్డును మెరుగుపర్చుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!