
సినిమాలు

భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ 2026 ఆసియా క్రీడల్లో పురుషుల 10 వేల మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించాడు. శుక్రవారం జరిగిన ఫైనల్‌లో 28:29.38 నిమిషాల్లో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. బహ్రెయిన్‌కు చెందిన బిర్హాను బలేవ్ 28:27.51 నిమిషాలతో స్వర్ణం సాధించగా, ఆల్బర్ట్ కిప్టో 28:34.18 నిమిషాలతో కాంస్యం గెలిచాడు.
2022 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో 10 వేల మీటర్లలో కాంస్యం సాధించిన గుల్వీర్.. ఈసారి రజతంతో తన ప్రదర్శనను మెరుగుపర్చుకున్నాడు. 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 5 వేల, 10 వేల మీటర్లలో స్వర్ణాలు సాధించిన అతడు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు మహిళల పోల్‌వాల్ట్‌లో బరానికా ఎలన్‌గోవన్ కాంస్యం సాధించి, ఈ విభాగంలో ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!