
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఎక్సైజ్ పాలసీ అమలులో భాగంగా మద్యం దుకాణాల తాజా కేటాయింపు ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రెన్యూవల్ కోసం 3,650 ఏ4 మద్యం దుకాణాలను నోటిఫై చేయగా, 3,236 దుకాణాలను ప్రస్తుత లైసెన్స్‌దారులు రెన్యూవల్ చేసుకున్నారు. మిగిలిన దుకాణాలతో పాటు గతంలో కేటాయించకుండా మిగిలిన షాపులను కలిపి మొత్తం 807 దుకాణాలకు తాజా నోటిఫికేషన్ జారీ చేశారు.
807 మద్యం దుకాణాలకు అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 24న నోటిఫికేషన్ విడుదల కాగా, అక్టోబర్ 3న దరఖాస్తులను పరిశీలిస్తారు. అనంతరం అర్హులైన అభ్యర్థులను పారదర్శక లాటరీ విధానంలో ఎంపిక చేసి దుకాణాలను కేటాయించనున్నారు. 2026-27 ఎక్సైజ్ పాలసీ అక్టోబర్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2027 వరకు అమల్లో ఉంటుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!