

ఒరాకిల్ తన ఏఐ డేటా కేంద్రాలకు నిధులను అందించేందుకు, వ్యయాలు తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. ఏఐ డేటా కేంద్రాల విస్తరణ కోసం పెట్టుబడులు సమకూర్చేందుకు అమెరికా బ్యాంకులు వెనకడుగు వేస్తున్నందున, కొన్ని కార్యకలాపాలను విక్రయించాలనీ ఒరాకిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ఒరాకిల్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.
క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడుల విస్తరణలో భాగంగా అదనపు సామర్థ్యాన్ని సమకూర్చుకునేందుకు ఈ ఏడాదిలో 45–50 బిలియన్ డాలర్లు (సుమారు రూ.4–4.55 లక్షల కోట్లు) సమీకరించాలని ఒరాకిల్ భావిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ కథనం వెల్లడించింది. ఈ నిధుల సమీకరణ డెట్ మరియు ఈక్విటీ విక్రయాల ద్వారా జరగవచ్చని పేర్కొంది.
ఏఎమ్‌డీ, మెటా, ఎన్విడియా, ఓపెన్ఏఐ, టిక్‌టాక్, ఎక్స్ఏఐ వంటి దిగ్గజ క్లయింట్ల నుంచి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అదనపు సామర్థ్యంపై పెట్టుబడులు పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఒరాకిల్ షేరు మార్కెట్లో 3 శాతం వరకు నష్టంతో ట్రేడవుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!