

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాహేతర సంబంధం, చైనా గూఢచారిగా అనుమానిస్తున్న మహిళతో సంబంధాలున్నాయనే ఆరోపణలు తెరపైకి రావడంతో టెక్ రంగంలో కలకలం మొదలైంది. ఈ వ్యవహారంపై కంపెనీ బోర్డు అంతర్గత విచారణ ప్రారంభించినట్లు సమాచారం. జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం లేదా సంస్థ రహస్యాలు ఎలాంటి లీక్ కాలేదని బోర్డు భరోసా ఇచ్చినప్పటికీ ఇన్వెస్టర్ల ఆందోళన తగ్గలేదు. అమెరికా మార్కెట్లు సోమవారం ముగిసే సమయానికి ఎన్విడియా షేరు 4.27 శాతం నష్టపోయి 178.67 డాలర్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఒక దశలో 8 శాతానికి పైగా పడిపోయింది. ఈ పరిణామంతో కంపెనీ మార్కెట్ విలువలో రూ.18 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైనట్లు సమాచారం. ఏఐ రంగంలో కీలక వ్యక్తిగా ఉన్న హువాంగ్ నాయకత్వంపై అనిశ్చితి నెలకొనడం కూడా మదుపర్లలో ఆందోళనకు కారణమైంది.
మరోవైపు, అంతర్గత, ప్రభుత్వ విచారణలతో పాటు ఏఐ రంగంలో భారీ పెట్టుబడుల భవిష్యత్తుపై నెలకొన్న సందేహాలు కూడా ఎన్విడియా షేర్లపై ప్రభావం చూపుతున్నాయి. డెమోక్రాట్ల ఎన్నికల విజయంతో డేటా సెంటర్ల నిర్మాణం, విద్యుత్ వినియోగంపై కొత్త నిబంధనలు వచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెన్సన్ హువాంగ్‌కు మద్దతుగా మాట్లాడారు. ఎన్విడియా సీఈఓకు, చైనా గూఢచారిగా అనుమానిస్తున్న మహిళకు మధ్య ఉన్న సంబంధాలపై FBI దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తాను హువాంగ్‌తో మాట్లాడిన సందర్భంగా, ఆ మహిళ గూఢచారి అనే విషయం ఆయనకు తెలుసా అని ప్రశ్నించానని ట్రంప్ వెల్లడించారు. తనకు ఆ విషయం తెలియదని హువాంగ్ సమాధానమిచ్చారని, ఆయన చెప్పిన మాటలను తాను నమ్ముతున్నానని ట్రంప్ పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!