

కేంద్ర బడ్జెట్ 2026–27లో ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) మరియు భారత సంతతి ప్రజలు (పీఐఓ) భారత క్యాపిటల్ మార్కెట్లో నేరుగా పెట్టుబడులు పెంచే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇప్పటివరకు వీరు భారత ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు ఎఫ్పీఐ (FPI) లేదా ఎఫ్డీఐ (FDI) రూపంలో మాత్రమే పెడుతూ వచ్చారు.
తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకారం, ఒక వ్యక్తి ఎన్ఆర్ఐ లేదా పీఐఓ పెట్టుబడి పరిమితిని 5 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ, ఒక లిస్టెడ్ కంపెనీలో వీరి మొత్తం పెట్టుబడి పరిమితిని ప్రస్తుత 10 శాతం నుంచి 24 శాతానికి పెంచుతున్నారు. అయితే, ఈ నూతన నిబంధనలు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (PIS) ద్వారా మాత్రమే వర్తిస్తాయి. కేవలం నమోదైన స్టాక్ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు చేసే షేర్లు మరియు కన్వర్టబుల్ డిబెంచర్లుకు ఈ పరిమితి వర్తించనుంది.
ఇంకా, ఎన్ఆర్ఐలు, పీఐఓలు ఇప్పటి వరకు ఫెమా నిబంధనలకు అనుగుణంగా గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా మాత్రమే పెట్టుబడులు పెట్టాల్సి ఉండేది. ఇకపై FPI రిజిస్ట్రేషన్ లేకుండా, కేవైసీ (KYC) నిబంధనలు మరియు బ్యాంకింగ్ చానల్స్ ద్వారా నేరంగా భారత ఈక్విటీలలో పెట్టుబడులు చేయగలిగే అవకాశం లభిస్తోంది. RBI రాబోయే వారాల్లో దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఈ చర్య దేశీయ స్టాక్ మార్కెట్ స్థిరత్వం మరియు రూపాయి మారకం రేటులో స్థిరత్వంని కూడా తీసుకురాగలదని నిపుణులు భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!