.png&w=3840&q=75)

హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే రూపే ఆన్-ది-గో కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (ఎన్సీఎంసీ) కింద ఈ సేవలను ప్రారంభించింది. ఈ ఆల్-ఇన్-వన్ ట్రాన్సిట్ కార్డు ద్వారా ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా కూడా ప్రయాణికులు సులభంగా రవాణా చెల్లింపులు చేయగలరు. తొలి దశలో భాగంగా హైదరాబాద్ మెట్రో టికెట్ కౌంటర్ల వద్ద ఈ కార్డు కొనుగోలు చేయవచ్చు. ప్రయాణికుల ఫోన్ నంబరుకు వచ్చే ఓటీపీ ధ్రువీకరణ పూర్తైన తర్వాత మెట్రో ఏజెంట్ ద్వారా కార్డును పొందవచ్చు. యూపీఐ, నగదు లేదా ఇతర కార్డుల ద్వారా కార్డులో డబ్బులు జమ చేసుకునే అవకాశం ఉంది.
ఈ కార్డు ప్రీపెయిడ్ స్టోర్డ్ వాల్యూ విధానంలో పనిచేస్తుంది. అంటే కార్డులోని చిప్‌లోనే బ్యాలెన్స్ నిల్వ ఉంటుంది. దీంతో ఇంటర్నెట్ లేకపోయినా ట్యాప్ అండ్ పే విధానంలో పూర్తిగా ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు చేయవచ్చు. కార్డులో గరిష్ఠంగా రూ.2,000 వరకు బ్యాలెన్స్ జమ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ లావాదేవీలకు ఒక్కసారి గరిష్ఠంగా రూ.500 వరకు చెల్లింపులు చేయొచ్చు. హైదరాబాద్‌లో జారీ చేసినప్పటికీ ఈ కార్డును దేశవ్యాప్తంగా ఎన్సీఎంసీ అందుబాటులో ఉన్న మెట్రోలు, బస్సులు, రైళ్లు, టోల్ ప్లాజాలు, పార్కింగ్ కేంద్రాల్లో ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో మరిన్ని రవాణా వ్యవస్థలతో అనుసంధానం చేసి సేవలను విస్తరించనున్నట్లు ఫోన్‌పే పేమెంట్స్ హెడ్ దీప్ అగర్వాల్ తెలిపారు.
.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!