
ఓటీటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఈ పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అమరావతి అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఈనెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. అయితే ఆయన పర్యటించనున్న దేశాలు, అక్కడ నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇటీవల అమరావతి నిర్మాణం, పెట్టుబడులు, రాష్ట్ర మౌలిక వసతులపై చంద్రబాబు పలు సమీక్షలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!