

బిగ్ బాస్ తెలుగు 10లో 17వ రోజు కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు ఆసక్తికరంగా సాగాయి. కెప్టెన్సీ రేసులో చోటు కోసం కంటెస్టెంట్ల మధ్య పోటీ మరింత ఉత్కంఠగా మారింది. టెంప్టేషన్ టాస్క్‌లో భాగంగా రోహిత్, త్రిగుణ్ కెప్టెన్సీ కంటెండర్స్‌గా నిలిచే అవకాశాన్ని కోల్పోయారు. మరోవైపు వర్షిణి-అమన్, సుధీర్-సృష్టి మధ్య కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు జరిగాయి.
ఇదిలా ఉండగా, నరేష్‌ను కొంతమంది హౌస్‌మేట్స్ ఓ ప్రత్యేకమైన ముద్దుపేరుతో పిలవడంపై చర్చ జరిగింది. నరేష్ తనకున్న కొన్ని ఇబ్బందులను అధిగమించి ఈ స్థాయికి వచ్చారని, అతను అందరికీ ఆదర్శంగా ఉండాలని త్రిగుణ్ పేర్కొన్నారు. నరేష్‌ను ఆ పేరుతో పిలవడం సరికాదని రామ్ ప్రసాద్ కూడా అభిప్రాయపడ్డారు. అయితే వర్షిణి స్పందిస్తూ.. తాము ఆ పేరును ప్రేమగా పిలుస్తున్నామని, ప్రేమగా పిలవడానికి, అవమానించడానికి మధ్య చాలా తేడా ఉందని చెప్పింది.
ఆ తర్వాత వర్షిణి, అమన్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో పోటీపడ్డారు. టాస్క్‌లో భాగంగా స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి బ్యాగులను తీసుకుని, ముందుగా ఏర్పాటు చేసిన కొమ్మలపై వాటిని విసరాల్సి ఉంది. బ్యాగులు విసిరే క్రమంలో వర్షిణి, అమన్ మధ్య ఫిజికల్ కాంటాక్ట్ చోటుచేసుకుంది. చివరకు అమన్ టాస్క్‌లో విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్ రేసులో నిలిచాడు. ఈ ఘటనపై హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్లు చర్చించుకున్నారు.
తర్వాత వర్షిణి.. ‘ఒక ఆడదానితో గెలిచి ఏం రచ్చ చేస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించింది. మరోవైపు సుధీర్, సృష్టి మధ్య జరిగిన టాస్క్‌లో సృష్టి విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచింది. టెంప్టేషన్ టాస్క్‌లో భాగంగా ఆమె త్రిగుణ్‌ను కెప్టెన్సీ రేసు నుంచి తప్పించింది. దీంతో 17వ రోజు ఎపిసోడ్‌లో కెప్టెన్సీ పోటీతో పాటు కంటెస్టెంట్ల మధ్య చర్చలు, వాగ్వాదాలు ఆసక్తిని పెంచాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!