

దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలు మార్కెట్‌లో భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జెనరేటివ్ ఏఐ ప్రభావం, సంప్రదాయ ఐటీ సేవలపై తగ్గుతున్న డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన గిరాకీ వంటి కారణాలతో దేశంలోని టాప్ 10 ఐటీ కంపెనీల మార్కెట్ విలువ గరిష్ఠ స్థాయిలతో పోలిస్తే సుమారు రూ.19.28 లక్షల కోట్లు తగ్గినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఐటీ షేర్లపై మదుపర్ల విశ్వాసం కూడా దెబ్బతింటోంది.
అత్యధికంగా నష్టపోయిన సంస్థగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నిలిచింది. గరిష్ఠ స్థాయి నుంచి సంస్థ మార్కెట్ విలువ సుమారు రూ.9 లక్షల కోట్లు తగ్గింది. ఇన్ఫోసిస్, విప్రో, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, హెచ్‌సీఎల్‌టెక్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫసిస్, టెక్ మహీంద్రా షేర్లు కూడా తమ జీవితకాల గరిష్ఠ స్థాయిల నుంచి గణనీయంగా పడిపోయాయి. ఇదే సమయంలో అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీల మార్కెట్ విలువ కూడా భారీగా క్షీణించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!