
క్రీడలు

ఉదయ్ కోటక్ పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని హెచ్చరించారు. సీఐఐ వ్యాపార సదస్సులో మాట్లాడిన ఆయన, ఇరాన్ యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమైతే దేశ ప్రజలు, విధాన నిర్ణేతలు భారీ షాక్‌కు సిద్ధంగా ఉండాలని సూచించారు.
భారత్ చమురు, ఎల్పీజీ సరఫరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోందని ఉదయ్ కోటక్ గుర్తుచేశారు. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు మించి పెరిగితే దేశ ఆర్థిక లోటు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. కష్టకాలం వచ్చాక స్పందించడం కాకుండా ముందుగానే పొదుపు చర్యలు, ఆర్థిక సన్నద్ధతపై దృష్టి పెట్టాలని ప్రజలకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!