

నెస్లేకు చెందిన ప్రముఖ చాక్లెట్ వేఫర్ బార్ కిట్క్యాట్కు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. గత రెండు మూడు సంవత్సరాలుగా రెండో స్థానంలో ఉన్న భారత్ తాజాగా మొదటి స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం కిట్‌క్యాట్ 85 దేశాల్లో అమ్ముడవుతుండగా, అత్యధిక విక్రయాలు మాత్రం భారతదేశంలోనే నమోదవుతున్నాయి. వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్, కొత్త రుచుల ఆవిష్కరణలు, విస్తృత ప్రచార కార్యక్రమాలు ఇందుకు ప్రధాన కారణాలని నెస్లే వెల్లడించింది.
నెస్లే ఇండియా ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ తివారీ మాట్లాడుతూ, దేశీయంగా కిట్‌క్యాట్ మార్కెట్ వాటా నిరంతరం పెరుగుతోందన్నారు. ఇప్పటికే మ్యాగీకి భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉండగా, ఇప్పుడు కిట్‌క్యాట్ కూడా ఆ జాబితాలో చేరిందని తెలిపారు. కిట్‌క్యాట్ సెలబ్రేక్, పాప్స్, డిలైట్స్ వంటి కొత్త ఉత్పత్తులు మంచి స్పందన తెచ్చాయని కంపెనీ పేర్కొంది. భారత్ తర్వాత జపాన్, బ్రెజిల్, యూరప్ ప్రాంతాలు కిట్క్యాట్కు ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయని వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!