

2025 నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 95 కోట్లను దాటిందని ‘ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (IAMAI) – కాంటార్ సంయుక్తంగా విడుదల చేసిన ‘ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025’ వెల్లడించింది. 2024తో పోలిస్తే వినియోగదారుల సంఖ్యలో 8 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో 57 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ, షార్ట్ వీడియోలకు పెరిగిన ఆదరణ, ఏఐ వినియోగం విస్తరించడం ఇందుకు ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది.
దేశవ్యాప్తంగా 95.8 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉండగా, అందులో దాదాపు 54.8 కోట్లు గ్రామీణ భారత్‌కు చెందినవారు. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో యాక్టివ్ యూజర్ల వృద్ధి నాలుగు రెట్లు వేగంగా సాగుతోంది. దేశంలో 58.8 కోట్ల మంది షార్ట్ వీడియోలు వీక్షించగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య కొద్దిగా అధికంగా ఉంది. మొత్తం వినియోగదారుల్లో 44 శాతం మంది వాయిస్ సెర్చ్, ఇమేజ్ సెర్చ్, ఏఐ ఫిల్టర్లు, చాట్‌బాట్‌లు వంటి కృత్రిమ మేధ ఫీచర్లను ఉపయోగిస్తున్నారు. ఇక ఇప్పటికీ దాదాపు 57.9 కోట్ల మంది ఇంటర్నెట్‌ను యాక్టివ్‌గా వినియోగించడం లేదని, అయితే ఈ సంఖ్య ప్రతి ఏడాది తగ్గుతోందని నివేదిక స్పష్టం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!