

ట్రాన్స్‌యూనియన్ నివేదిక ప్రకారం 2025లో భారత వినియోగదారులు డిజిటల్ మోసాల కారణంగా సగటున 2,265 డాలర్లు (దాదాపు రూ.2.04 లక్షలు) నష్టపోయారు. ఇది ప్రపంచ సగటు 1,671 డాలర్లతో పోలిస్తే 36 శాతం ఎక్కువ. అయితే దేశంలో డిజిటల్ మోసం రేటు 7.1 శాతంగా ఉండగా, 2024లో నమోదైన 13.1 శాతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది.
గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబరు మధ్య కాలంలో 59 శాతం మంది వినియోగదారులు సైబర్ మోసం ప్రయత్నాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. 13 శాతం మంది మోసానికి గురైనట్లు వెల్లడించారు. ఫిషింగ్ మోసాలు అత్యధికంగా ఉండగా, విషింగ్, స్మిషింగ్, ఈ-కామర్స్ థర్డ్ పార్టీ స్కామ్‌లు కూడా ఎక్కువగా నమోదయ్యాయి.
రంగాల వారీగా లాజిస్టిక్స్‌లో 16.3 శాతం, టెలికాం 14.7 శాతం, ఇన్సూరెన్స్ 11.5 శాతం డిజిటల్ మోసాలు నమోదయ్యాయి. 2024–25 మధ్యకాలంలో టెలికాం రంగంలో 308 శాతం, ఇన్సూరెన్స్‌లో 145 శాతం, లాజిస్టిక్స్‌లో 31 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తం మోసాలు తగ్గినప్పటికీ ప్రమాదం ఇంకా కొనసాగుతోందని నివేదిక హెచ్చరించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!