

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026ను ఆగస్టు 7 అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులు, హోమ్ అప్లయెన్సెస్, కిచెన్ వస్తువులు, గ్రాసరీ తదితర విభాగాల్లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. టాప్ 100 డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్, ట్రెండింగ్ డీల్స్, 8 పీఎం స్పెషల్ డీల్స్‌తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందించనుంది. ఎంపిక చేసిన కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ, రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
డిస్కౌంట్లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు, అమెజాన్ పే రివార్డ్స్ ద్వారా కొనుగోళ్లను మరింత తక్కువ ధరలో చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న పిన్కోడ్లకు వేగవంతమైన డెలివరీ సేవలు అందించనున్నట్లు అమెజాన్ తెలిపింది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్న ప్రైమ్ సభ్యులకు 5 శాతం, ఇతర సభ్యులకు 3 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అర్హులైన వినియోగదారులు అమెజాన్ పే లేటర్ ద్వారా రూ.60,000 వరకు క్రెడిట్‌తో పాటు వడ్డీ లేని ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు.
ఈసారి సేల్‌లో కృత్రిమ మేధ (ఏఐ) ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రూఫస్ ఏఐ షాపింగ్ అసిస్టెంట్ ద్వారా సాధారణ భాషలో అడిగిన ప్రశ్నలకు తగిన ఉత్పత్తులను సూచించనుంది. లెన్స్ ఏఐ సహాయంతో ఫోటో ఆధారంగా వస్తువులను వెతికే అవకాశం ఉంటుంది. అలాగే 30 నుంచి 90 రోజుల ప్రైస్ హిస్టరీ ట్రాకర్, ఏఐ రివ్యూ హైలైట్స్ ద్వారా ధరల మార్పులు, ముఖ్యమైన సమీక్షల వివరాలను సులభంగా తెలుసుకుని సరైన కొనుగోలు నిర్ణయం తీసుకోవచ్చు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!